కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పెదనందిపాడు లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళ సంఘం జిల్లా కార్యదర్శి జి రమణ, సిఐటియు నాయకులు దొప్పలపూడి రమేష్ బాబు మాట్లాడుతూ రైతులు. కార్మికులను ఇబ్బంది పెట్టే4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు.