గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరు-అప్పాపురం గ్రామాల మధ్య నల్లమడ వాగుకు బుధవారం రాత్రి వరద ప్రవాహానికి గండి పడింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాగు వరద ఉధృతి పంట పొలాలపైకి ప్రవహిస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ సంఘటనతో పంట నష్టంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.