గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫేజ్-3 శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులపై శుక్రవారం గుంటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శనివారం జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.