గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామంలోని ఒకటో వార్డులోని ప్రజలు కరెంటు కోతలతో విసుగు చెంది ఆదివారం రోడ్డుపై బైఠాయించారు. గత 2 రోజులుగా ఇష్టానుసారoగా కరెంటు కోతలు విధిస్తున్నారని అదేమని ప్రశ్నిస్తే మీకు చేతనయం చేసుకోండి మేము చేయము అంటూ కరెంటు సిబ్బంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రజల ఆగ్రహించారు. గుంటూరు_ పర్చూర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.