కాకుమాను మండలo పరిధిలోని అప్పాపురం ఛానల్ పూడికతీతలు శుక్రవారం శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారుల నేతృత్వంలో కాలువ మరమ్మత్తులు చేపట్టారు. గుర్రపు డెక్కను, జమ్మును రైతులు దగ్గర ఉండి వారికి అనుకూలమైన రీతిలో పనులను చేయించుకుంటున్నారు. చివరి భూముల వరకు నీరందేందుకు చర్యలు చేపట్టినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.