గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్ రెడ్డిపాలెం లో శుక్రవారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కూటమి శ్రేణులతో కలిసి ఎన్ టి ఆర్ భరోసా సామాజిక పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఓటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు హామీలకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.