ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెం మేజర్ 15 నంబరు ఇరిగేషన్ కాలువను బుధవారం ఇరిగేషన్ డిఈ మల్లికార్జున్, డిసి కల్లూరి కుసుమ, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరు శ్రీనివాసరావు రైతులతో కలిసి పరిశీలించారు. రబీ సాగునీరు రైతులకు సకాలంలో అందుతుందా లేదా అని పరిశీలించినట్లు డిఈ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో రైతులకు చివరి భూముల వరకు నీరు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.