ప్రతిపాడు: ప్రతి రైతును ఆదుకుంటాం గాదే

ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, శుక్రవారం పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామం, కాకుమాను మండలం అప్పాపురం గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి రైతును ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. డ్రైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే తమ పొలాలు నిరంతరం దెబ్బతింటున్నాయని, శాశ్వత పరిష్కారం చూపితేనే వ్యవసాయం చేసుకోగలమని రైతులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

సంబంధిత పోస్ట్