గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం కేంద్రంలోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పాఠశాల భవనంలోని రెండు గదులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నికీలలు ఎగిసిపడటంతో విద్యార్థులు భయంతో తరగతి గదులు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.