గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగభైరవారి పాలెం గ్రామంలో చెన్నుపాటి వెంకటసుబ్బారావు కు చెందిన పొగాకు బేళ్లను శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి పొగలు రావడంతో గమనించిన స్థానికులు సుబ్బారావు తెలియజేయడంతో నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. చిలకలూరిపేట నుండి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.