డ్వాక్రా సభ్యుల నగదులో రూ. 11 లక్షల గోల్‌మాల్?

కాకుమాను మండలం గరికపాడులో డ్వాక్రా యానిమేటర్ శ్యామలపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. రెండు డ్వాక్రా గ్రూపులకు చెందిన సభ్యులు రెండేళ్లుగా చెల్లించిన సుమారు రూ. 11 లక్షలను బ్యాంకులో జమ చేయకుండా ఆమె కాజేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ఏపీఎంకు ఫిర్యాదు చేసినా, పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు కాకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేసినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్