వైసీపీ నేత అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాం కేంద్ర మంత్రి

గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు కూటమి ప్రభుత్వం త్వరలో సినిమా చూపిస్తుందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం పెదనందిపాడు మండలం కొప్పరు గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెమసాని చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా సినిమా చూపిస్తామని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్