కారంపూడి మండలానికి అన్నదాత సుఖీభవ క్రింద 4. 53 కోట్ల విడుదల

కారంపూడి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం క్రింద ప్రభుత్వం వారు 4. 53 కోట్ల రూపాయలను మొత్తం 6465 మంది రైతులకు రేపు విడుదల చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి శుక్రవారం పోట్ల నరసింహారావు తెలిపారు. ఒక్కో రైతుకు మొత్తం 7000 రూపాయలు ప్రభుత్వం నుండి డైరెక్ట్ గా రైతు బ్యాంకు అకౌంట్ లో జమచేయబడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్