ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏబీఎన్ లో 'కొత్త పలుకు' పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల భార్యలను నీచమైన భాషతో దూషించారని ఆరోపిస్తూ, గురువారం రేపల్లె పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పీటా మోహన్ పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.