కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవు

కల్తీకల్లు విక్రయిస్తే చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ రాజశ్రీ చెప్పారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో కల్తీ కల్లు తాగి పలువురు మృతి చెందిన నేపథ్యంలో రేపల్లె లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం భట్టిప్రోలు, రేపల్లెకు చెందిన కల్లు విక్రేతలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిషేధిత పదార్ధాలైన డైజోఫామ్, క్లోరోఫామ్, ఆల్రోజోమ్ వంటి రసాయన పదార్థాలు హాని కలిగిస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్