మోళ్ల గుంటలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి బిజెపి

రేపల్లె నియోజకవర్గం బిజెపి నేతలు పిన్ని సాంబశివరావు, డానియేల్, పీతా రవి, సైకం రాజు శనివారం మోళ్ల గుంట గ్రామంలో పర్యటించారు. గ్రామస్థాయి పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోళ్ల గుంటలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని నేతల దృష్టికి తెచ్చారు. జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని బిజెపి నేతలు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్