రేపల్లెలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పుస్తకావిష్కరణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకులు 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ ప్రత్యేక పోస్టర్‌తో పాటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, ఇంకొల్లు రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్