చెరుకుపల్లి మండలం రాంబోట్లవారి పాలెం పంచాయతీ పరిధిలోని పిట్టు కోటి రెడ్డి పాలెం లో శనివారం రాత్రి బుసక మాఫియా రైతులను బెదిరించి వారి పొలాల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, వారికి సహకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పిజిఆర్ఎస్ లో పెట్టిన దానిపై కూడా స్పందించలేదని తెలిపారు. బుసక మాఫియాను కట్టడి చేసి న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.