అనంతవరం: పిల్లలకు ముర్రు పాలు తాగించాలి

పిల్లలు పుట్టిన గంటలోపే తల్లి ముర్రు పాలను పిల్లలకు అందించాలని ఏం ఎల్ హెచ్ బి విజయకుమారి అన్నారు. శుక్రవారం తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అనంతవరం గ్రామంలో అంగన్వాడి కార్యకర్తలు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ కుమారి మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానం అన్నారు. తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా గా పనిచేస్తుందన్నారు. తల్లులకు పాల యొక్క ప్రాముఖ్యతను తెలియ చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్