31 కోట్ల తొ 28 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం వేగవంతం

రేపల్లె నియోజకవర్గంలో రూ. 31 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 28 ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపు లైన్ పనులు 90% పూర్తయ్యాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్య వంటి మౌలిక వసతుల బలోపేతంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇంటింటికి కుళాయి లక్ష్యంతో ప్రతి గ్రామానికి శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు అధికారులు, ఇంజినీరింగ్ విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్