విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దుచేయాలని పెంచుతున్న విద్యుత్ చార్జీలు తగ్గించాలి సిపిఎం ఎం. ఎల్ రాష్ట్ర నాయకులు శోభారాణి, సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రేపల్లెలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.