మహిళల సాధికారత, యువతలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు మిషన్ శక్తి ఆధ్వర్యంలో రేపల్లె ఆంధ్ర రత్న హై స్కూల్ లో 20 రోజుల ప్రత్యేక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, డిజిటల్ భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో రేపల్లె సిడిపిఓ సుచిత్ర, సూపర్వైజర్ హిమబిందు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.