యూరియా అధిక మోతాదులో వాడితే భూసారం తగ్గుతుంది

బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో జరిగిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం. విజయనిర్మల మాట్లాడుతూ, యూరియాను అధికంగా వాడటం వల్ల భూసారం తగ్గి, భవిష్యత్తులో దిగుబడులు తగ్గుతాయని హెచ్చరించారు. ఏడిఏ ఎ. లక్ష్మీ కూడా భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం పోషకాల సమతుల్యత తగ్గి, దిగుబడులు, నాణ్యత ప్రమాణాలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో ఎ. మహేష్ బాబుతో పాటు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్