గాంధీ వర్ధంతి: రేపల్లెలో ఘనంగా నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా, బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కాళేపల్లి ఈశ్వరబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ తునుగుంట్ల విశ్వనాధ గుప్తా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరబాబు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం, ప్రపంచానికి అహింస మార్గాన్ని చూపిన మహాత్ముడి అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళా సంఘ సభ్యులు, ఆర్య వైశ్య ప్రముఖులు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్