రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 5, 6వ వార్డుల అంగన్వాడీ కేంద్రాలలో సీడీపీఓ ఎం సుచిత్ర ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారుల కోసం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రీ-స్కూల్ విద్యను పూర్తి చేసుకుని ప్రాథమిక పాఠశాలలో చేరబోతున్న చిన్నారులకు సుచిత్ర శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. అనంతరం "అంగన్వాడీ పిలుస్తోంది" కార్యక్రమం నిర్వహించి, చిన్నారులు, తల్లులు, సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు.