ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ, కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను ఈ ఏడాది ఆగస్టు నాటికి అమలు చేయాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం భట్టిప్రోలులోని ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28న తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన రాష్ట్ర కార్యవర్గం, కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు.