భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో, బుధవారం నుండి 14 అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కరిస్టులు చేపట్టే భీమ్ దీక్షలు సమాజ చైతన్యానికి దోహదపడతాయని బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు న్యాయవాది దారం సాంబశివరావు తెలిపారు. రేపల్లెలోని ది ఆదిఅంధ్ర నవబుద్ధిస్ట్ సొసైటీ కార్యాలయంలో తొలిసారిగా భీమ్ దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో నౌ బుద్ధి సొసైటీ కార్యదర్శి దోవా రమేష్ రామ్ జి, సాంబశివరావు, నవ బుద్ధిష్ట్ సొసైటీ ఉపాధ్యక్షుడు నీలా జోజి బాబు పలువురు పాల్గొన్నారు.