ఆశా వర్కర్లకు కనీస వేతనాలు, సెలవులు అమలు చేయాలని కోరుతూ బుధవారం రేపల్లె పిహెచ్సి వైద్యుడు మోళ్ళగుంట విశ్వేశ్వరంకు వినతి పత్రం అందించారు. బాపట్ల జిల్లా సిఐటియు కోశాధికారి సిహెచ్ మణిపాల్ మాట్లాడుతూ, ఈనెల 5వ తేదీన విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశా వర్కర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆశా వర్కర్ యూనియన్ నాయకులు దానమ్మ, గ్లోరీ, బుజ్జి, దేవి పాల్గొన్నారు.