ముఖ్యమంత్రి చంద్రబాబు నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భట్టిప్రొలు మెయిన్ డ్రైన్ పై నిర్మించిన వెల్లటూరు అక్విడక్ట్ ను శుక్రవారం కలెక్టర్ వెంకట మురళి, వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు తో కలిసి ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన 75 రోజుల్లోనే అక్విడక్ట్ ను నిర్మించడం ఓ రికార్డ్ గా మంత్రి సత్యప్రసాద్ తెలిపారు.