రేపల్లె పట్టణంలోని మూడో వార్డులో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన పనులను మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఏనాడు ప్రజల వద్దకు వెళ్లలేదన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని మంత్రి అనగాని తెలిపారు.