ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒక్క సంతకంతో పెన్షన్లను 3 వేల నుంచి 4 వేలకు పెంచిన ఘనత సంక్షేమ సారథి చంద్రబాబు కే దక్కుతుందని రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె రూరల్ మండలం పెనుమూడి గ్రామంలో శుక్రవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు, పూర్తి వైకల్యం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల నెలా రూ. 15 వేలు అందిస్తున్నామన్నారు.