సమ్మెలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నించాలని కోరుతూ మంగళవారం రేపల్లెలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ కి వినతి పత్రం అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రేపల్లెలో అందుబాటులో ఉన్న శివప్రసాద్ కి వినతిపత్రం అందించారు.