బాపట్ల, రేపల్లెలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మధుమోహన్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారానే భూమికి, రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు. నడుంపల్లి గ్రామంలోని అనగాని బిఆర్సి కేంద్రం వద్ద వేసవి సాగు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, బిఆర్సి విత్తనాలు సాగు చేయడం వల్ల నేల బలం పెరిగి ఖరీఫ్లో వరి దిగుబడులు అధికమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి హుస్సేన్, సీఆర్పీలు, ఐసిఆర్పీలు, రైతులు పాల్గొన్నారు.