పీటా నాగమోహన్ కృష్ణ నిజాంపట్నం పర్యటన: మొగధారమ్మ తల్లి దర్శనం

రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ, నిజాంపట్నం మండలం నిజాంపట్నం గ్రామంలో శ్రీ మొగధారమ్మ తల్లి తిరుణాల మహోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిజాంపట్నం మండలానికి ఇది ఆయన తొలి సందర్శన. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్