విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ఈ నెల 14వ తేదీన రేపల్లె పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యామ్ సుధాకర్ బాబు తెలిపారు. రేపల్లె టౌన్ 3 ఫీడర్ లో ఆర్ డి ఎస్ ఎస్ స్కీమ్ ద్వారా అభివృద్ధి పనులు జరుగుతన్న కారణంగా రేపల్లె పట్టణంలోని పలు ఏరియాలలో మరియు చిన్న ఆరవపల్లి గ్రామంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా అంతరాయం ఏర్పడుతుందన్నారు.