బాపట్ల ఏరువాక శాస్త్రవేత్తలు కె. అచ్చిత రాజు, కామాక్షి నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమంలో పాల్గొన్నారు. వేరుశనగ పూత, కాయ దశలో ఉన్నప్పుడు టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశిస్తుందని తెలిపారు. నివారణకు ఎకరాకు సాఫ్ 400 జి లేదా ప్రోపికొనజోల్ 200 మి.లీ. పిచికారి చేయాలని, తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటే నేటివో 160 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. రేపల్లె ఏడీఏ లక్ష్మి సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి చుక్కా విజయ రాజు, రైతులు పాల్గొన్నారు.