రేపల్లెలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని నిరసన

రేపల్లె సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జి.రామ్ జి చట్టం వ్యవసాయ కూలీల ఉపాధిని దెబ్బతీస్తుందని, దానిని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం తహసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ, 2025 కొత్త గ్రామీణ ఉపాధి చట్టం పేదల పని హక్కును హరిస్తుందని, 2005 చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సమృద్ధిగా లభిస్తుందని తెలిపారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్