రేపల్లె: రక్తదానం మరొకరికి ప్రాణదానం డి. ఎస్. పి

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె డిఎస్పి ఆవుల శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. 20 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని డిఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్