పట్టణంలోని ఎస్. ఎస్. ఎస్ మున్సిపల్ హైస్కూల్ లో బుధవారం బాల వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. బాలల హక్కులను పరిరక్షించడం, బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఈ కార్యక్రమ లక్ష్యం. రేపల్లె ఐసిడిఎస్ సిడిపిఓ సుచిత్ర, బాల్య వివాహాల వల్ల పిల్లల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసం, భవిష్యత్తుపై పడే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు వివరించారు.