రేపల్లె: ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆనందబాబు

ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో సుభిక్ష పాలన దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చదలవాడ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్