పెట్రోల్ డీజిల్ కొరతను తగ్గించాలని రేపల్లెలోనిరసన కార్యక్రమం

యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, ప్రజల అవసరాలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ సరఫరా చేయాలని కోరుతూ మంగళవారం సీపీఎం, సీఐటీయూ నాయకులు రేపల్లె బస్టాండ్ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు సమస్యలను అధిగమించడానికి ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించాలని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో లేని కొరతను ఆంధ్రప్రదేశ్‌లో సృష్టిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్