బాపట్ల, రేపల్లె ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల పాటు ఆర్మీలో సైనికుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన తురుమెళ్ళ ఆనంద్, తన స్వగ్రామం నడింపల్లికి చేరుకున్నారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి, 'భారతమాతకు జై' అంటూ నినాదాలు చేస్తూ, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అన్నం పెట్టే రైతులను, దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దివాకర్ యూత్ సభ్యులు తురుమెళ్ళ దివాకర్ అన్నారు. ఆర్మీ జవానుకు లభించిన గౌరవాన్ని చూసి ఆనంద్ పరవశించారు.