పెద్దపల్లి గ్రామంలోని శ్రీ నాగదేవత ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ పాల్గొని, గ్రామంలో సుఖశాంతులు, పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.