భారత దేశంలో మొదటిసారిగా అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో ఒకే సమయంలో పేటీఎం 2. 0 నిర్వహించడం విద్యా రంగంలోనే చారిత్రక మైలురాయి అని రెవిన్యూ శాఖ మంత్రి అనగానే సత్తప్రసాద్ అన్నారు. రేపల్లె మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం రాష్ర్ట విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అహార్నీశలు పని చేస్తున్నారన్నారు.