నేడు సత్తెనపల్లి పీఎస్‌కు అంబటి రాంబాబు

వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై ఇటీవల వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నేడు ఆయన సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరుకానున్నారు. అంబటితో పాటు విడదల రజిని, అప్పిరెడ్డి కూడా హాజరవుతారని సమాచారం. కాగా జగన్ గత నెల రెంటపాళ్లలో పర్యటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్