నరసరావుపేటలోని 12వ వార్డులో ఆదివారం ఉదయం ఆస్తి విషయమై మహబూబ్ బాషాపై అతని పెదనాన్న షేక్ రసూల్ దాడికి పాల్పడ్డాడు. రసూల్ కత్తితో బాషా గొంతు కోశాడని స్థానికులు తెలిపారు. వెంటేనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తమకు తగిన న్యాయం చేయాలని మహబూబ్ బాషా తల్లి రహతా వేడుకుంది.