సత్తెనపల్లిలో కానిస్టేబుల్ పై దాడి

సత్తెనపల్లి బస్టాండ్లో శనివారం కానిస్టేబుల్ బి. శ్రీనివాస్పై గుర్తుతెలియని యువకులు దాడి చేశారు. ద్విచక్ర వాహనాలతో బస్టాండ్లో హల్చల్ చేస్తున్న ఇద్దరు యువకులను కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్