నకరికల్లులో అంబటిపై పోలీసులకు ఫిర్యాదు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, టీడీపీ నేతలు శనివారం నకరికల్లు ఎస్సై సతీష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజి చౌదరి మాట్లాడుతూ, అంబటి తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్