పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గం రాజుపాలెం మండల పరిధిలోని దేవరంపాడు గ్రామ శివారులో ఉన్నటువంటి నేతి వెంకన్న స్వామి హుండీ ఆదాయం సోమవారం మధ్యాహ్నం లెక్కించినట్లు దేవదాయ శాఖ ఈవో గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం నాలుగు లక్షల 87 వేల నూట పది రూపాయలు ఆదాయం రావడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.