సత్తెనపల్లిలో పీలేరు యువ న్యాయవాది హత్యకు న్యాయవాదుల నిరసన

పీలేరు యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య దారుణ హత్యను సత్తెనపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం తాలూకా కోర్టు ప్రాంగణంలో అధ్యక్షుడు గంగూరి అజయ్ కుమార్ నేతృత్వంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి, నిందితులకు కఠిన శిక్షలు వేయాలని, న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని, పూజారి ఎల్లయ్యకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల సురక్షితాన్ని నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో కోర్టు ప్రాంగణం మారుమోగింది.

సంబంధిత పోస్ట్